శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 20:01:41

నటుడు అమీర్‌ఖాన్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

నటుడు అమీర్‌ఖాన్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

ఘజియాబాద్‌ : బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వివాదాలకు కొత్తేమీ కాదు. ఈసారి అతను ఎపిడెమిక్‌ యాక్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినిమా షూటింగ్‌ కోసం వచ్చిన నటుడు అమీర్‌ఖాన్‌.. ఎపిడెమిక్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఉత్తరప్రదేశ్‌లోని లోని‌ ఎమ్మెల్యే నందకిషోర్‌ గుర్జార్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపాలని ఆయన డిమాండ్‌ చేశారు. సినిమా షూటింగ్‌కు వచ్చిన అమీర్‌ఖాన్‌ ముఖానికి మాస్క్‌ ధరించకుండా.. పబ్లిక్‌గా తిరుగుతూ అభిమానులతో ఫొటోలు దిగారని, ఈ సమయంలో కనీస నిర్ణీత దూరం పాటించకుండా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేలా ప్రవర్తించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గుర్జార్‌ తెలిపారు. ఘజియాబాద్‌లోని ట్రోనికా నగరంలో సినిమా షూటింగ్ కోసం బుధవారం వచ్చినప్పుడు కొవిడ్‌-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని పోలీసు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఆగస్టు నెలలో టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వెళ్లినప్పుడు కలవడం వివాదస్పదమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.