గురువారం 04 మార్చి 2021
Cinema - Dec 30, 2020 , 00:12:37

కాలం తోడుగా వేడుక

కాలం తోడుగా  వేడుక

దినేష్‌తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్‌కుమార్‌.కె దర్శకుడు. వెంకటేష్‌ కొత్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నిన్నే నేనిలా..కాలం తోడుగా’ అనే గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. కృష్ణవేణి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని అనురాగ్‌ కులకర్ణి, లిప్సిక ఆలపించారు. కార్తిక్‌ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఓ జంట ప్రణయభావనలకు చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది. ఇటీవల విడుదలచేసిన ఫస్ట్‌లుక్‌, సింగిల్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. సరికొత్త ప్రేమకథగా నవ్యానుభూతిని పంచుతుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.  సంజయ్‌స్వరూప్‌, గురురాజ్‌, బిందు, సంధ్యాజనక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నగేష్‌ బన్నెల్‌.

VIDEOS

logo