శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 09, 2020 , 19:54:06

లొకేషన్ల వేటలో కార్తికేయ-2 టీం..

లొకేషన్ల వేటలో కార్తికేయ-2 టీం..

నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కార్తికేయ-2ను ఇటీవలే ప్రకటించారు. తొలి పార్టు లాగే మరో కొత్త సోషియా ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు డైరెక్టర్ చందూ మొండేటి ప్లాన్ చేస్తున్నాడు. చందూ మొండేటి అండ్ టీం సీక్వెల్  కోసం సినిమా కథానుగుణంగా సరిపోయే లొకేషన్లను అన్వేషించే పనిలో పడిందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కార్తికేయ-2ను తెరకెక్కిస్తున్నారు. కార్తికేయలో హీరోయిన్ స్వాతిని తీసుకోగా..మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 


logo