శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 07:29:50

షూటింగ్‌పై రాళ్ల‌ దాడి.. త‌ప్పించుకున్న ర‌కుల్‌

షూటింగ్‌పై రాళ్ల‌ దాడి.. త‌ప్పించుకున్న ర‌కుల్‌

గ్లామ‌ర్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంతో పాటు హిందీ సినిమాల‌లోను న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరో జాన్ అబ్ర‌హంతో క‌లిసి ఎటాక్ అనే మూవీ చేస్తుండ‌గా, ఈ మూవీ షూటింగ్ ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లోని ధ‌నిపూర్‌లో జ‌రుగుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు చిత్రీక‌ర‌ణ చూసేందుకు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వారిని సెక్యూరిటీ అడ్గుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

షూటింగ్ చూసేందుకు సెక్యూరిటీ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో స్థానికులు గొడ‌వ‌ప‌డ్డారు. కొంద‌రు రాళ్ళ‌తో దాడి కూడా చేశారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. అనంతరం షూటింగ్ నిర్వహించారు. రాళ్ల దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడగా.. హీరో జాన్ అబ్రహం హీరోయిన్ రకుల్ కు ఎటువంటి గాయాలు కాలేదు. లక్ష్యరాజ్ దర్శకత్వంలో 'ఎటాక్' చిత్రం రూపొందుతుండ‌గా, ఈ సినిమాని ఆగస్టు 13న  రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.  

VIDEOS

logo