ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 14:51:04

సల్మాన్, జాక్వెలిన్ సైక్లింగ్ వీడియో వైరల్

సల్మాన్, జాక్వెలిన్ సైక్లింగ్ వీడియో వైరల్

బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ముంబై వీధుల్లో అప్పుడప్పుడు సైక్లింగ్ చేస్తూ కనిపిస్తాడనే విషయం అందరికీ  తెలిసిందే. అయితే సల్లూభాయ్ ఈ సారి కూడా  సరదాగా సైక్లింగ్ చేశాడు. లాక్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇపుడు గతంలో లాగా రోడ్లపై తిరిగే అవకాశం లేదు. దీంతో పన్వేల్ తన ఫాంహౌస్ కోస్టార్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేశాడు.

సల్మాన్ సైక్లింగ్ చేస్తూ ముందు వెళ్తుంటే..స్నేహితులతోపాటు జాక్వెలిన్ అతన్ని ఫాలో అవుతున్నారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ మారింది. సైక్లింగ్ చేస్తూ వెళ్తున్న సల్మాన్ ఫ్యాన్స్ చీర్స్ చెప్తున్నారు.


logo