నామినేషన్ ప్రక్రియ ఎంత హాట్‌గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ముందుగా వచ్చిన ప్రియ.. లోబో, సన్నీలను నామినేట్ చేసింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేసిన దూరంగా ఉంటున్నారని పేర్కొంది. ఇక లోబో టైం రావడంతో అతను ప్రియను నామినేట్ చేస్తూ రచ్చ చేశాడు. నా ప్రేమ కహానీ చెబితే సినిమా స్టోరీలా ఉందని ఎలా అంటావ్.
ఆ నిమిషం నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ ప్రియపై గట్టి గట్టిగా అరిచాడు. ఎవరెన్ని చెప్పినా లోబో ఒకవైపు గట్టిగా అరుస్తూ అంతలోనే ఏడస్తూ నానా హంగామా చేశాడు.లోబో ఏడుస్తున్న సమయంలో అతని దగ్గరకు వచ్చిన రవి ఓదార్చే ప్రయత్నం చేశాడు.దీనికి లోబో.. నా లవ్ స్టోరీ నీకు తెలుసు కదరా అంటూ బాధపడ్డాడు.
అయితే ప్రియ కూడా లోబోకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. నా మీద అలా అరిచే రైట్ నీకు లేదని అనడంతో మరింత గట్టిగా అరిచాడు. ఇది ప్రియని బాగా హర్ట్ చేయడంతో కన్నీరు పెట్టుకుంది. ఇక సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ లవ్‌స్టోరీ చెప్తుండగా ఆకలేస్తోంది అని ఎలా అనగలిగావని విమర్శించాడు. సిరిని నామినేట్ చేసాడన్న కారణం ఏమో కాని షణ్ముఖ్.. లోబోని నామినేట్ చేస్తూ గట్టి వార్నింగ్‌లే ఇచ్చాడు.
మీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లోబోను నామినేట్ చేశాడు షణ్ముఖ్. ఆ సమయంలో లోబో..పేదాడిని,బస్తీ నుండి వచ్చాననని చెప్పడంతో కోపోద్రిక్తుడయ్యాడు షణ్ముఖ్. ప్రతిసారి బస్తీ నుంచి, కింది నుంచి వచ్చానని చెప్పొద్దు, అందరం అక్కడి నుంచే వచ్చామంటూ అతడి నోరు మూయించాడు.