బాలీవుడ్ నటి,మోడల్ లీసా హెడెన్ ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మూడో బిడ్డ పుట్టిన విషయాన్నికాస్త సీక్రెట్‌గా మెయింటైన్ చేసిన లీసా తల్లిపాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించింది. మీ మూడో పాప ఎక్కడున్నారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా నా చేతుల్లో ఉంది అని సమాధానమివ్వడంతో ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చినట్టు అర్ధమైంది.
జూన్ 22న పండంటి బిడ్డకు జన్మనించిన లీసా ఇప్పటికి వరకు బేబీ ఫొటోలను షేర్ చేయలేదు. అయితే రీసెంట్గా తన సోషల్ మీడియాలో బిడ్డకు పాలిస్తూ ఫొటోలు దిగగా వాటిని తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేసింది. తన చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డ లీసా.. చిన్నారి పేరు లారాగా వెల్లడించింది. అయితే అగష్టు 1 నుంచి 7వ తేదీల్లో జరిగిన వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ సెలబ్రెషన్స్ అనంతరం లిసా తన కూతురికి పాలు పడుతున్న ఫొటోను షేర్ చేసింది.
చెన్నైకి చెందిన లీసా హెడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్లో ఆమెకు ఆఫర్స్ రావడంతో ముంబై చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ హిందీలో ‘హౌస్‌ఫుల్ 2’, ‘క్వీన్’ వంటి చిత్రాలలో నటించింది. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు జాక్, లియో కాగా ఇటీవల కూతురు జన్మించింది.