శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 19:12:56

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

క్రాక్ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లతో దూసుకెళ్తుండ‌టంతో ఫుల్ జోష్‌మీదున్నాడు ర‌వితేజ‌. క్రాక్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే త‌న కొత్త సినిమా ఖిలాడి షూటింగ్‌ను మొద‌లుపెట్టాడు. ర‌వితేజ సెట్స్ లో జాయిన్ అయిన విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. నా కొత్త సినిమా ఖిలాడి సెట్స్ నుండి..లైట్స్..కెమెరా..యాక్ష‌న్ అంటూ లొకేష‌న్ లో సెల్ఫీ దిగి ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఖిలాడి చిత్రాన్ని ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. 

మేక‌ర్స్ జ‌న‌వ‌రి 26న ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఖిలాడి టీజ‌ర్ ను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి ఖిలాడి చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. అభిమానులకు మ‌రో హిట్టు అందించాల‌ని బ్యాక్ టు బ్యాక్ సినిమా చేస్తూ బిజీ అయిపోయాడు ర‌వితేజ‌. 

ఇవి కూడా చ‌ద‌వండి

ర‌వితేజ‌ 'ఖిలాడి' టీజ‌ర్ కు టైం ఫిక్స్..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo