అఖిల్ అక్కినేని (Akhil), పూజాహెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ (Most Eligible Bachelor). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘ లెహరాయి (Leharaayi) లెహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి..లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి’..అంటూ సాగే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అఖిల్, పూజాహెగ్డే మరోసారి రొమాంటిక్ మూడ్లో కనిపిస్తున్నారు. లిరికల్ వీడియోను సెప్టెంబర్ 15న 11.30కు విడుదల చేస్తున్నట్టు ప్రోమో ద్వారా తెలియజేశారు. ఈ పాటను సింగింగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడాడు. ఈ పాటకు వ్యూస్ పంట పండటం ఖాయమని ప్రోమోతో తెలిసిపోతుంది. సిధ్ శ్రీరామ్ తన వాయిస్ తో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై వాసు వర్మ, బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ అక్కినేని నటించిన సినిమాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ పైనే పెట్టుకున్నాడు అఖిల్.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!