బుధవారం 03 జూన్ 2020
Cinema - Feb 20, 2020 , 12:09:58

విజ‌య నిర్మ‌ల కాంస్య‌ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన కృష్ణ‌, మ‌హేష్‌

విజ‌య నిర్మ‌ల కాంస్య‌ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన కృష్ణ‌, మ‌హేష్‌

న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన మ‌హిళగా ఎంతో ఖ్యాతి పొందారు విజ‌య నిర్మ‌ల‌. గత ఏడాది జూన్‌లో ఈ లెజండరీ దర్శకురాలు  కన్నుమూసారు. ఆమె మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌ శోకసంద్రంలో మునిగిపోయింది. ఫిబ్రవరి 20న ఆమె తొలి జయంతి  సంద‌ర్భంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు . నానక్‌రామ్‌గూడలోని విజయనిర్మల నివాసంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌గా,  కొద్ది సేప‌టి క్రితం ఇక్క‌డే  విజయ నిర్మల కాంస్య‌ విగ్రహాన్ని ఆవిష్క‌రించారు. ఈ విగ్రహాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు, కృష్ణ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు క‌లిసి ఆవిష్కరించారు. కృష్ణం రాజు, న‌మ్ర‌త‌, సుధీర్ బాబు, ప‌ర‌చూరి బ్ర‌ద‌ర్స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.  సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్ద‌రి పెయిర్ ఎప్ప‌టికీ హిట్ పెయిరే. 


logo