బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 19:02:29

ము‌త్త‌య్య‌ ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ మోష‌న్ పోస్ట‌ర్

ము‌త్త‌య్య‌ ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ మోష‌న్ పోస్ట‌ర్

ప్ర‌పంచ క్రికెట్‌లో  త‌న స్పిన్ మాయాజాలంతో ప‌లు రికార్డులను న‌మోదు చేసుకున్న‌ శ్రీలంక లెజెండ‌రీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి 800 టైటిల్ ను ఫిక్స్ చేసిన టీం..ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ముర‌ళీధ‌ర‌న్ జీవితంలోని ప‌లు ద‌శ‌ల‌ను బొమ్మ‌ల రూపంలో చూపిస్తూ సాగే మోష‌న్ పోస్ట‌ర్ సినీ, క్రీడాభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఎంఎస్ శ్రీప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెర‌కెక్కుతుంది.   


ప్ర‌‌పంచ క్రికెట్లో ప‌లు రికార్డులు త‌న పేరుపై లిఖించుకున్న ముర‌ళీధర‌న్ వ‌‌న్డేలతోపాటు టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసారు. వ‌న్డేల్లో ముర‌ళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నిర్మించ‌బోయే చిత్రం పేరు 800కు ఈ రికార్డే స్ఫూర్తి అని తెలుస్తోంది. 2011లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక వివిధ టీ20 టోర్నీల్లో ముర‌ళీ ఆడాడు. అనంత‌రం కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ప్ర‌స్తుతం అతను ఐపీఎల్ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు స్పిన్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ చిత్రంలో ముర‌ళి స్నేహితుడు, ప్ర‌ముఖ క్రికెట‌ర్ క‌మ్ కామెంటేట‌ర్ ర‌సెల్ ఆర్నాల్డ్ పాత్ర‌లో క‌మెడియ‌న్ యోగి బాబు మెర‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo