బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 16:56:48

వేట‌లో లెజెండ‌రీ యాక్ట‌ర్..గ్రూప్ ఫొటో చ‌క్క‌ర్లు

వేట‌లో లెజెండ‌రీ యాక్ట‌ర్..గ్రూప్ ఫొటో చ‌క్క‌ర్లు

శివాజీ గ‌ణేశ‌న్‌..భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న లెజెండ‌రీ యాక్ట‌ర్ల‌లో ఒక‌రు. ఆయ‌న కెరీర్ లో చేసిన కొన్ని పాత్ర‌లు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతాయి. శివాజీ గ‌ణేశ‌న్ రిచ్ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేసేవార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు ఈ లెజెండ‌రీ సూప‌ర్ స్టార్ వేట‌లో ఉన్న‌ప్ప‌టి త్రోబ్యాక్ ఫొటో ఒక‌టి ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బిజీ షెడ్యూల్ తో తీరిక లేకుండా ఉండే శివాజీ గ‌ణేశ‌న్ విరామ స‌మ‌యంలో త‌మిళ‌నాడులోని ప్ర‌ఖ్యాతి గాంచిన ఫారెస్ట్ ఏరియాలో తుపాకీ ప‌ట్టుకుని వేట కొన‌సాగించాడు.

బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ లో శివాజీ గ‌ణేశ‌న్ కొంత‌మంది స్నేహితుల మ‌ధ్య‌లో ఉండి తుపాకీ ప‌ట్టుకుని త‌న ల‌క్ష్యానికి గురిపెడుతున్న స్టిల్ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo