ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 13:32:30

నా ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు వాస్త‌వం: ర‌జ‌నీకాంత్

నా ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు వాస్త‌వం: ర‌జ‌నీకాంత్

త‌మిళ సూపర్ స్టార్ రజ‌నీకాంత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా గ‌త రాత్రి నుండి వ‌స్తున్న అనేక ప్ర‌చారాల‌కు అడ్డుక‌ట్ట వేశారు.  2011లో ర‌జనీకాంత్‌ కిడ్నీ సమస్య తో బాధ‌ప‌డ్డార‌ని, దీని కోసం ఆయ‌న  సింగ‌పూర్‌లో వైద్యం చేయించుకున్నార‌ని లేఖ‌లో ఉంది. ఇక 2016లో ఆ స‌మ‌స్య మ‌ళ్ళీ రావ‌డంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నారంటూ కూడా లేఖ‌లో రాసారు. అయితే ఈ వార్త‌లు అన్ని వాస్త‌వాలే అంటూ త‌లైవా క్లారిటీ ఇచ్చారు.

అభిమానుల‌ని ఉద్దేశించి నేను రాసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న లేఖ మాత్రం నాది కాదు. ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్రం స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చించాక నేను రాజ‌కీయ పార్టీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తాను అని త‌లైవా పేర్కొన్నారు. కాగా, ర‌జ‌నీకాంత్ పేరుతో లీకైన లెట‌ర్‌లో తన‌కు కిడ్నీ మార్పిడి వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. క‌రోనా స‌మ‌యంలో పార్టీ ప్ర‌క‌టించ‌డం, అంద‌రితో క‌లిసి స‌భ‌లు పెట్ట‌డం ప్రాణాల‌కు రిస్క్‌. అందుకే పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ఆలోచిస్తున్నా అంటూ లేఖ‌లో రాసి ఉంది.