శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 17:05:44

‘ల‌క్ష్మిబాంబ్’ టైటిల్ మారింది

‘ల‌క్ష్మిబాంబ్’ టైటిల్ మారింది

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తోన్న చిత్రం ల‌క్ష్మిబాంబ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. రాఘ‌వాలారెన్స్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే విడుద‌ల‌కు ముందే భారీ మార్పు చేసింది చిత్ర‌యూనిట్. ల‌క్ష్మిబాంబ్ టైటిల్ నుంచి బాంబ్ పేరును తొల‌గించి.. టైటిల్ ను ‘ల‌క్ష్మి’గా మార్చారు మేక‌ర్స్. కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ ప్రాజెక్టు న‌వంబ‌ర్ 9న డిస్నీ+ హాట్ స్టార్ లో విడుద‌ల కానుంది.

హిందీలో డైరెక్ట‌ర్ గా రాఘ‌వాలారెన్స్ కు ఇది తొలిచిత్రం. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీక‌రించిన వీడియో సాంగ్ కు అద్బుత‌మైన స్పంద‌న వస్తోంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.