శనివారం 30 మే 2020
Cinema - May 09, 2020 , 08:25:57

చివరి ద‌శ‌కు ల‌క్ష్మీ బాంబ్‌.. ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు

చివరి ద‌శ‌కు ల‌క్ష్మీ బాంబ్‌.. ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు

లాక్‌డౌన్ పెరుగుతూ పోతుండ‌డంతో నిర్మాత‌లకి దిక్కు తోచ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు సిద్ధం చేయ‌గా, ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫాంల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో అమృత‌రామ‌మ్ రిలీజ్ కాగా, నిశ్శ‌బ్ధం చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తార‌నే టాక్ వినిపిస్తుంది.

లాక్‌డౌన్ వ‌ల‌న థియేట‌ర్స్ బంద్ కావ‌డంతో కాల‌క్షేపం కోసం ప్ర‌జ‌లు ఓటీటీల‌నే ఆశ్ర‌యిస్తున్నారు. మ‌రోవైపు ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. దీంతో న‌ష్టాల‌నుండి తేరుకునేందుకు  నిర్మాత‌లు ఓటీటీల‌వైపు దృష్టి సారిస్తున్నారు . అక్ష‌య్ కుమార్ న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ చిత్రం  డిస్నీ హాట్ స్టార్స్ లో రిలీజ్ కావ‌డం ప‌క్కా అని బాలీవుడ్ మీడియా చెబుతుంది.

తెలుగు కాంచ‌న సినిమాకి రీమేక్‌గా ల‌క్ష్మీబాంబ్ తెర‌కెక్క‌గా, ఈ చిత్రం ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుది ద‌శ‌లో ఉన్నాయ‌ట‌. ఇవి పూర్తి కాగానే వెంట‌నే ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ట‌. ఇప్ప‌టికే  హీరో అక్షయ్‌, నిర్మాత తుషార్‌ కపూర్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ ప్రతినిధి విజయ్‌ సింగ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, దాదాపు కోట్ల‌కి డీల్ కుద‌ర‌డంతో సినిమాని  ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి.


logo