శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 02, 2020 , 11:11:30

స్టార్ హీరోల సాయం కోరుతున్న లారెన్స్

స్టార్ హీరోల సాయం కోరుతున్న లారెన్స్

న‌టుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ లారెన్స్ మంచి సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తి అన్న సంగ‌తి మ‌నంద‌రి తెలిసిందే. ఏ క‌ష్టం వ‌చ్చిన త‌న వంతు సాయ‌చేడంలో లారెన్స్ ముందుంటారు. క‌రోనా సంక్షోభంలో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కి రూ.3 కోట్ల సాయం చేశారు లారెన్స్‌. అయితే సినీ రంగానికి  చెందిన ప‌లువురు కూడా త‌మ‌ని ఆదుకోవాల‌ని కోర‌డంతో లారెన్స్ .. డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి రూ.15 ల‌క్ష‌లు, న‌డిఘ‌ర్ సంఘానికి రూ. 25 ల‌క్ష‌లు, పారిశుద్ధ్య కార్మికులకి రూ.25 ల‌క్ష‌లు అందించారు. మొత్తంగా రూ.4 కోట్ల వ‌ర‌కు సాయం అందించారు.

ఇప్ప‌టికీ త‌న‌కు చాలా మంది ఫోన్ చేసి సాయం కోరుతున్నార‌ని లారెన్స్ పేర్కొన్నాడు. పిల్ల‌ల‌ని, వృద్దులని ఆదుకోవాల‌ని కోర‌డంతో వారికి నిత్యావ‌సర వ‌స్తువుల రూపంలో సాయం చేయాల‌ని అనుకున్నాను. ఇందులో భాగంగా కొంద‌రి సాయం కోరాను. ర‌జ‌నీకాంత్ ముందుగా స్పందించి వంద బ‌స్తాల రైస్ పంపారు. అలానే క‌మ‌ల్, విజ‌య్, అజిత్,సూర్య‌ల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా త‌మ‌వంతు సాయం చేయాల‌ని కోరుకుంటున్నా. ఈ స‌మ‌యంలో చిన్న సాయ‌మైన ఎంద‌రికో అండంగా ఉంటుంద‌ని లారెన్స్ పేర్కొన్నారు. త‌ను తెర‌కెక్కించిన ల‌క్ష్మీ బాంబ్ చిత్రానికి రావ‌లసిన రెమ్యున‌రేష‌న్‌ని పీఎం రిలీఫ్ ఫండ్‌కి పంపాల‌ని నిర్మాత‌ల‌ని కోరిన‌ట్టు ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు లారెన్స్


logo