బుధవారం 03 జూన్ 2020
Cinema - May 12, 2020 , 13:53:44

ఆంధ్రా ప్ర‌జ‌ల‌కి సాయం చేసిన లారెన్స్

ఆంధ్రా ప్ర‌జ‌ల‌కి సాయం చేసిన లారెన్స్

క‌రోనా సంక్షోభంలో లారెన్స్ చూపిస్తున్న ఔదార్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రూ.4 కోట్ల విరాళాలు అందించిన లారెన్స్ పేదవారికి నిత్యావ‌స‌రాలు కూడా అందిస్తూ వ‌స్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయ‌న చెన్నైలో చిక్కుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ని చూసి చ‌లించిపోయారు. తిండి, నీడ లేక ఇబ్బంది ప‌డుతున్న 37 మంది ఆంధ్రా ప్ర‌జ‌లని వారి స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేయ‌మ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామిని కోరారు.

తాజాగా  37 మందిని రైళ్ళ‌ల్లో స్వ‌స్థ‌ల‌లాకి పంపింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. ఈ సంద‌ర్భంగా ప‌ళ‌నిస్వామికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ విష‌యంలో త‌మ‌వంతు బాధ్య‌త‌ని నిర్వ‌ర్తించిన  ఆఫీస‌ర్స్, క‌లెక్ట‌ర్స్ ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు లారెన్స్ . అంతేకాక ఈ రోజు ప‌ళ‌నిస్వామి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు అందిస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్ధించారు. ‌


logo