శనివారం 06 జూన్ 2020
Cinema - May 03, 2020 , 08:20:33

నిండు గ‌ర్భిణికి క‌రోనా.. సాయం చేసిన లారెన్స్

నిండు గ‌ర్భిణికి క‌రోనా.. సాయం చేసిన లారెన్స్

రాఘ‌వ లారెన్స్ క‌రోనా క‌ష్ట  కాలంలో దాదాపు రూ. 4 కోట్లు విరాళం ఇవ్వ‌డంతో పాటు ఆప‌ద‌లో ఉన్న‌వారికి అన్ని విధాలుగా సాయం చేస్తూ వెళుతున్నారు. తాజాగా ఆయ‌న చేసిన సాయానికి నిండు గ‌ర్భిణీ ప్రాణాలు ద‌క్కించుకోవ‌డంతో పాటు పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం  త‌ల్లి బిడ్డ క్షేమంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

డెలివ‌రీ స్టేజ్‌లో ఉన్న మ‌హిళ‌కి క‌రోనా సోక‌డంతో భ‌య‌ప‌డ్డ ఆమె భ‌ర్త‌, మామ‌లు లారెన్స్‌కి ఫోన్ చేసి సాయం అడిగారు. దీంతో వెంట‌నే లారెన్స్ ఆరోగ్య శాఖ మంత్రి పీఏకి ఫోన్ చేసి అసలు విష‌యం వివరించారు. వెంట‌నే ఆయ‌న గ‌ర్భిణీని కేఎమ్‌సీ ఆసుప‌త్రికి త‌ర‌లించే ఏర్పాటు చేశారు. గ‌ర్భిణీకి క‌రోనా సోక‌డంతో వైద్యులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ఆప‌రేష‌న్ చేశారు. పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించింది. ఈ స‌మయంలో సాయం చేసిన ఆరోగ్య శాఖ మంత్రితో పాటు వైద్యుల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు లారెన్స్‌


logo