శనివారం 06 జూన్ 2020
Cinema - May 23, 2020 , 23:38:00

రొమాన్స్‌కు కాస్త దూరం!

రొమాన్స్‌కు కాస్త దూరం!

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో తిరిగి షూటింగ్‌లు ఆరంభమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది లావణ్యత్రిపాఠి. ప్రస్తుతం ఆమె సందీప్‌కిషన్‌ సరసన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో నటిస్తోంది. కొంతభాగం షూటింగ్‌ మిగిలిపోయింది. ఈ సందర్భంగా లావణ్యత్రిపాఠి  మాట్లాడుతూ ‘ సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టాలంటే కాస్త భయంగానే ఉంది. ప్రొడక్షన్‌ టీమ్‌ ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకుంటుందో వేచి చూడాలి.  చిత్రీకరణ సమయంలో సెట్‌లో చాలా మంది ఉంటారు. అందులో ఒక్కరికి వ్యాధి లక్షణాలు కనిపించినా షూటింగ్‌ మొత్తం ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. కథానుగుణంగా ఇంటిమేట్‌ సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి వస్తే మీరు అంగీకరిస్తారా అని అడగ్గా...‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉండటమే మంచినదనుకుంటున్నా. అయితే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో  రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది’ అని పేర్కొంది.


logo