సోమవారం 25 మే 2020
Cinema - Mar 17, 2020 , 17:07:41

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లావణ్యత్రిపాఠి ఫిర్యాదు

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లావణ్యత్రిపాఠి ఫిర్యాదు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. శ్రీమోజు సునిశిత్‌ అనే వ్యక్తి పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు లావణ్యత్రిపాఠి ఫిర్యాదు చేసింది. లావణ్య త్రిపాఠి మెయిల్‌ ద్వారా పోలీసులను సమాచారం అందించింది.

ఈ విషయమై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఏవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ..యూట్యూబ్‌ ఛానళ్లలో సునిశిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సునిశిత్‌ ఇతర సెలబ్రిటీలపై కూడా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పటివరకు లావణ్యత్రిపాఠి మాత్రమే ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఏసీపీ వెల్లడించారు. 


logo