ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 29, 2020 , 21:29:54

ప్రణీత, లావణ్య వీరిద్దరేనా.. ఇంకెవరు స్పందించరా?

ప్రణీత, లావణ్య వీరిద్దరేనా.. ఇంకెవరు స్పందించరా?

ఒకవైపు కరోనా మహమ్మారి  విజృంభిస్తోంది.  ప్రపంచదేశాలతో పాటు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.  తిరిగి అందరూ బయటికి వచ్చి ఎవరిపని వారు చేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. అయితే ఈ క్రమంలో బాగా ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రోజూవారి కూలీలే. పని చేస్తేనే గానీ పూట గడవని కార్మికులు భారతదేశంలో చాలా మందే ఉన్నారు. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’ మనకోసం అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు విరాళాలు బాగానే వస్తున్నాయి. కాకపోతే కొంత నిరాశపరిచే విషయం ఏమిటంటే లావణ్య, ప్రణీత తప్ప ఇంత వరకు మరో హీరోయిన్ సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం.

సహాయం చేయగలిగిన వారందరూ ముందుకు రండి అని స్వయంగా ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలదీ అదే దారి. అంతగా ఆర్థిక వ్యవస్థని ఈ మహమ్మారి కుదిపేస్తుంది. మరి ఇలాంటి సమయంలో లక్షలు, కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ నుంచి పొందుతున్న హీరోయిన్లు తిరిగి ఆ పరిశ్రమను ఆదుకోవడానికి రాకపోవడం నిజంగా విడ్డూరమే. ఇకనైనా ఎవరికి తోచినంత వారు సహాయం చేయడానికి నటులే కాకుండా నటీమణులు కూడా ముందుకు రావాలి. మీకోసం, మీరు చేసే సినిమా కోసం ఎంతో కష్టపడే సినీ కార్మికులను ఆదుకోవాలి. భారతమాత రుణం తీర్చుకునే సమయమిది. సహాయం చేయగలిగిన ప్రతి ఒక్కరూ ఎవరికీ తోచినంత వారు సహాయం అందించి రుణం తీర్చుకోండి. ఇప్పటికైనా కదలండి.


logo