2012లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాని, మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది.
తెలుగుతో పాటు అడపాదడపా తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ అలరిస్తున్న లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలను నెటిజన్స్‌కు చేరవేస్తూ ఉంటుంది. తాజాగా నైసీ జొసెఫ్ కొరియోగ్రఫీలో ఎంతో అందంగా డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది లావణ్య త్రిపాఠి. ఈ వీడియో చూసిన అభిమానులు లావణ్యలో ఇంత మంచి డ్యాన్సర్ దాగి ఉందా అనే కామెంట్స్ పెడుతున్నారు.