మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 10:53:40

నటుడు 'లవకుశ' నాగరాజు ఇక లేరు

నటుడు 'లవకుశ' నాగరాజు ఇక లేరు

నందమూరి తారక రామారావు , అంజలీదేవి , కాంతారావు,  నాగరాజు,  సుబ్ర‌హ్మణ్యం, చిత్తూరు నాగయ్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా తెరకెక్కించిన చిత్రం ల‌వ‌కుశ‌. 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు.1934లో బ్లాక్ అండ్ వైట్లో లవకుశను దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.

లవ‌కుశ చిత్రంలో ల‌వుడిగా నాగ‌రాజు న‌టించగా, కుశుడిగా సుబ్ర‌హ్మ‌ణ్యం న‌టించారు. సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇందులో ల‌వుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్ర‌హ్మ‌ణ్యం అద్భుతంగా న‌టించారు. అయితే కొద్దిసేప‌టి క్రితం ల‌వ‌కుశ ఫేం నాగ‌రాజు అనారోగ్యంతో క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతికి తెలుగు సినీ చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం తెలిపింది. 


logo