మూవీ మొఘల్ డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా టాలీవుడ్లో ఎన్నోఅద్భుతమైన సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలను ప్రస్తుతం దగ్గుబాటి సురేష్ బాబు ,మనవడు రానా చూసుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుండగా, ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తోంది.
‘సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్’ అనే లేబుల్ తో సంగీత పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వారు ప్రకటించారు. ”50 ఏళ్లుగా సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ‘సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్’ అనే మ్యూజిక్ లేబుల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాని అవసరాన్ని గుర్తించాము. ‘SP మ్యూజిక్’ మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని.. సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది” అని నిర్మాణ సంస్థ ప్రకటనలో పేర్కొంది.