గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 14:46:21

పుష్ప త‌ర్వాతి షెడ్యూల్ ఎప్ప‌డంటే..!

పుష్ప త‌ర్వాతి షెడ్యూల్ ఎప్ప‌డంటే..!

లెక్క‌ల మాస్టారు సుకుమార్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం పుష్ప‌. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం నవంబ‌ర్ 10 నుండి డిసెంబ‌ర్ 6 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మారేడుమ‌ల్లి అట‌వీ ప్రాంతంలో ఓ షెడ్యూల్ జ‌రుపుకోవ‌ల‌సి ఉంది. కాని చిత్ర బృందంలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో వెంట‌నే షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పి స్వీయ నిర్భందంలోకి వెళ్ళారు. ఇక ఇప్ప‌డు ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రచారం జ‌రుగుతుంది.

పుష్ప చిత్రం త‌దుపరి షెడ్యూల్ డిసెంబ‌ర్ 12 నుండి హైద‌రాబాద్‌లో జ‌రుపుకోనుంద‌ని తాజా స‌మాచారం.ఈ షెడ్యూల్ పూర్తైన త‌ర్వాత జ‌న‌వ‌రిలో మారేడుమ‌ల్లి అడ‌వుల‌లో మేజ‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ట‌. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న పుష్ప చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. 


logo