e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఊహించని బడ్జెట్..!

ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఊహించని బడ్జెట్..!

ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఊహించని బడ్జెట్..!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్‌లో ఎన్టీఆర్, కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అప్పట్లో కోట్లు విలువ చేసే విల్లాను జూనియర్ ఎన్టీఆర్ ఈ దర్శకుడికి బహుమతిగా ఇచ్చాడు కూడా. జనతా గ్యారేజ్ తర్వాత కొర‌టాల‌ చేసిన భరత్ అనే నేను సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌తో కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. చిరంజీవితో చేస్తున్న ఆచార్య పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు కొరటాల శివ. అంతేకాదు పోయినసారి రిపేర్లు లోకల్ లో జరిగాయి కానీ ఈ సారి పాన్ ఇండియన్ స్థాయిలో జరుగుతాయని క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. మరి ఆ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కొర‌టాల శివ ఈసారి కూడాప‌వ‌ర్‌ఫుల్‌ పవర్ ఫుల్ కథతోనే రాబోతున్నాడని తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు.. ఎలా ఉంటాడు అనే దానిపై ఇప్పట్నుంచే నందమూరి అభిమానులు ఊహించుకుంటున్నారు. ఓ చిన్న ఊరు నుంచి పట్నం వచ్చి అక్కడ ఎలా రూలర్ గా మారాడు.. జనానికి అండగా ఎలా ఉన్నాడు అనే లైన్‌తో ఈ సినిమాను కొరటాల తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పరిస్థితుల కారణంగా సాధారణంగా ఉన్న వ్యక్తి.. అసాధారణంగా ఎలా ఎదిగాడు అనేది చాలా సినిమాల్లో చూసిన కథే. రొటీన్ గానే ఉన్న ఈ కథను కమర్షియల్‌గా తెరకెక్కించడంలో కొరటాల సిద్ధహస్తుడు. ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. సినిమాపై పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Tollywood : అంద‌రి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇత‌ర భాష‌ల హీరోలు

రాజ‌మౌళి చ‌దివింది ఇంట‌రే.. మ‌రి త్రివిక్ర‌మ్‌, క్రిష్‌, సుకుమార్ ఏం చ‌దివారో తెలుసా?

సీక్రెట్‌ ఏజెంట్స్‌గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు

రేప‌టి నుంచే తెలంగాణ‌లో సినిమా థియేట‌ర్లు ఓపెన్

తెలుగులో వ‌చ్చిన తొలి డ‌బ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఊహించని బడ్జెట్..!
ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఊహించని బడ్జెట్..!
ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఊహించని బడ్జెట్..!

ట్రెండింగ్‌

Advertisement