మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 09:17:08

బిగ్ బాస్‌ 4: 50 రోజులు కాదు 106 రోజులు!

బిగ్ బాస్‌ 4: 50 రోజులు కాదు 106 రోజులు!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆగ‌స్ట్ 30న ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్‌4కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాగా, షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న నాగార్జున‌పై ప‌లు ప్రోమోస్ షూట్ చేస్తున్నారు. కరోనా వ‌ల‌న బిగ్ బాస్ సీజన్ 4 ఉండ‌ద‌ని కొంద‌రు పుకార్లు పుట్టించ‌గా, ఇది 50 రోజులు మాత్ర‌మే ఉంటుంద‌ని ప్ర‌చారం చేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీజ‌న్ కూడా సెంచ‌రీ కొడుతుంద‌ని తెలుస్తుంది.

బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స్టార్‌మాతో పాటు హాట్ స్టార్‌ల‌లో ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఈ షో కోసం ప‌లు బ్రాండింగ్స్ క్యూ క‌డుతున్నాయి.  హాట్ స్టార్ నుంచి ఇన్ స్టాగ్రామ్‌లో బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రమోషనల్ పోస్టర్ ఒకటి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో 16 మంది సెలబ్రిటీలు.. 15 వారాలు.. 106 ఎపిసోడ్స్ అని చెప్పుకొచ్చారు. అంటే గత సీజ‌న్‌ల మాదిరిగా బిగ్ బాస్ సీజ‌న్ 4 కూడా వంద రోజులకి పైగానే ర‌న్ అవుతుందన్న‌మాట‌. అయితే షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ని మాత్రం అన్ని ర‌కాల టెస్ట్‌లు చేసి మాత్ర‌మే బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపుతార‌ట‌. logo