గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 16, 2021 , 13:25:54

ప్రభాస్‌ ‘సలార్‌’ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. హీరోయిన్‌.. విలన్‌ ఎవరో తెలుసా?

ప్రభాస్‌ ‘సలార్‌’ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. హీరోయిన్‌.. విలన్‌ ఎవరో తెలుసా?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ రాధేశ్యామ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న సాలార్‌ చిత్రంలో నటించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కేజీఎఫ్‌ ఫేమ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, డైరెక్టర్‌తో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రాక్‌స్టార్‌ యశ్‌ హాజరయ్యారు. సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ప్రారంభించాలని మేకర్స్‌ యోచిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఓ లెటెస్ట్‌ సమాచారం అందింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చిత్రీకరణలో ప్రభాస్‌ పాల్గొననున్నాడు. ఎలాంటి విరామం లేకుండా వరుసగా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ప్రశాంత్ నీల్ మొత్తం షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే ముగించాలని నిర్ణయించాడట. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ, ఎంఎస్‌ ధోని ఫేమ్‌ దిషా పటానిని హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. అలాగే విలన్‌గా బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌. ప్రభాస్‌ ఈ చిత్రం తర్వాత ఓం రౌత్‌ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్‌’తో పాటు ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు. ఇందులో బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది.

VIDEOS

logo