dakko dakko meka | సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను రాసుకున్న కథ ఒక భాగంలో చెప్పడం కుదరదని రెండు భాగాలుగా చెప్పబోతున్నాడు సుకుమార్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి పాట ఆగస్టు 13న విడుదల కానుంది. దీనికి సంబంధించిన మొదటి అప్డేట్ 10 రోజుల కింద ఇచ్చింది చిత్రయూనిట్. ఇక అప్పటి నుంచి పుష్ప ప్రమోషన్ మొదలైంది. ప్రతిరోజు ఆ పాటకు సంబంధించిన ఒక చిన్న విజువల్ విడుదల చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.
ఒక్క పాటకి ఇంత ప్రమోషన్ అవసరమా అని చాలా మంది సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్న కూడా పుష్ప యూనిట్ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. తాము చేయాలనుకున్న పని ఏ మాత్రం పక్కదారి పట్టకుండా చాలా క్లారిటీగా చేస్తున్నారు. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో స్వర పరుస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఒకే రోజు 5 భాషలలో ఈ పాటను విడుదల చేయనున్నారు. తాజాగా 11 సెకన్లు ఉన్న ఒక చిన్న ప్రోమో విడుదల చేశారు. ఇందులో నోట్లో కత్తి పెట్టుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు బన్నీ. ఇది చూసి అభిమానులు కూడా అలాగే ఊగిపోతున్నారు.
ఖచ్చితంగా పాట మరో స్థాయిలో ఉంటుంది అంటూ నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఐదు భాషల్లో ఐదుగురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రజినీకాంత్ చిన్నపిల్లోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్ హీరోయిన్
సెప్టెంబర్లో సినిమాల జాతర..క్యూలైన్ లో ఉన్న సినిమాలివే..!
వైరల్గా మారిన యషికా హాస్పిటల్ పిక్.. !
ఈ శుక్రవారం థియేటర్స్లో సందడి చేయనున్న సినిమాలేంటో తెలుసా?