శనివారం 06 జూన్ 2020
Cinema - May 24, 2020 , 10:50:50

దుల్క‌ర్ 'కురుప్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

దుల్క‌ర్ 'కురుప్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మ‌ల‌యాళం యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో  కురుప్ పేరుతో  చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మూవీకి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు.. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్‌ సుకుమార కురుప్‌  జీవితం ఆధారంగా ఈ మూవీ ’ తెరకెక్కుతోంది. సుకుమార కురుప్‌ పాత్రలో దుల్కర్‌ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్‌ ప్రారంభం అయింది. శోభిత దూళిపాళ్ళ తొలిసారి ఈ సినిమా ద్వారా దుల్కర్‌తో జతకడుతుంది.  తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో దుల్క‌ర్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. 


logo