మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 08:28:07

సోమ‌వారం శుభ‌వార్త వింటార‌న్న బాలు త‌న‌యుడు

సోమ‌వారం శుభ‌వార్త వింటార‌న్న బాలు త‌న‌యుడు

ప్ర‌ముఖ నేప‌థ్య‌గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం కొద్ది రోజులుగా క‌రోనాతో పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలుని ఐసీయూలో ఉంచి ఎక్మో సాయం అందిస్తూ, ఫిజియో థెర‌పీ చేస్తున్నారు. ఆయ‌న ఆరోగ్యంపై అభిమానులు ఆందోళ చెందుతున్న స‌మ‌యంలో బాలు త‌న‌యుడు ఎస్పీ చ‌ర‌ణ్ గుడ్ న్యూస్ చెప్పారు.

త‌ను షేర్ చేసిన వీడియోలో ఎస్పీ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. వ‌రుస‌గా నాలుగో రోజు నాన్న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. మెల్ల‌గా కోలుకుంటున్నారు. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రార్ధ‌న‌ల‌తో సోమ‌వారం మంచి శుభ‌వార్త వినోబోతున్నారు అని పేర్కొన్నారు. దీంతో బాలు ఆరోగ్యం కుదుప ప‌డింద‌ని త్వ‌ర‌లోనే ఐసీయూ నుండి జ‌న‌ర‌ల్ వార్ఢ్‌కు రాబోతున్న‌ట్టు అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే క‌రోనా బారిన ప‌డ్డ బాలు భార్య కరోనా నుండి కోలుకున్న సంగ‌తి తెలిసిందే.  


logo