బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 13:20:33

యువ గాయ‌ని ప్ర‌తిభ‌కి ఫిదా అయిన ల‌తా మంగేష్క‌ర్

యువ గాయ‌ని ప్ర‌తిభ‌కి ఫిదా అయిన ల‌తా మంగేష్క‌ర్

గాన కోకిల లతా మంగేష్క‌ర్ పాట‌కి ప‌రవశించని వారు లేరు. సుమ‌ధుర‌మైన గొంతుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న ల‌తా మంగేష్క‌ర్ యువ‌గాయ‌ని ప్ర‌తిభ‌కి ముగ్ధురాలైంది. ఆ గాయ‌ని పాడిన పాట‌కి సంబంధించిన వీడియోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ అభినందించింది. ఆస్ట్రియ‌న్ మొజార్ట్ 40వ వాద్య గోష్టిని మ‌న భార‌తీయ రాగంతో ఆల‌పించిన ఆ యువ గాయ‌ని టాప్‌లో ఉండాల‌ని నేను కోరుకుంటున్నాను. ఆమెకి నా ఆశీర్వాదం అందిస్తున్నాను అని లతా ట్వీట్ చేసింది.

విదేశీ సంగీతానికి భార‌తీయ స‌రాగాలు జోడించి పాడిన క్లాసిక‌ల్ సింగ‌ర్ సామ‌దిప్తా ముఖ‌ర్జీ.. ల‌తా ప్ర‌శంల‌కి ముగ్ధురాలైంది. ధ‌న్యురాలిని మేడ‌మ్. మిమ్మ‌ల్ని ఆరాధించే వారిలో నేను ఒక‌టి. చిన్న‌ప్ప‌టి నుండి మిమ్మ‌ల్ని ఆరాధిస్తూ ఉన్నాను. ఈ రోజు మీరు నాపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే, భ‌గ‌వంతుడు ఆశీర్వ‌దించిన‌ట్టు ఉంది. ఇంత‌కి మించి నాకు ఏం కావాలి. మీ ఆశీస్సులు నాకు ఎల్ల‌ప్పుడు ఉండాల‌ని కోరుకుంటున్నాను. సంగీత ప్రపంచంలో అత్యున్న‌త స్థాయికి ఎదిగేందుకు త‌ప్ప‌క కృషి చేస్తాను అంటూ సామ‌దిప్తా త‌న ట్వీట్‌లో రాసుకొచ్చింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo