సోమవారం 25 మే 2020
Cinema - Mar 31, 2020 , 22:23:57

లతా మంగేష్కర్‌ 25లక్షల విరాళం

లతా మంగేష్కర్‌ 25లక్షల విరాళం

కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటాలకు బాలీవుడ్‌ తారాగణం అండగా నిలుస్తూ తమ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. కరోనా వైరస్‌ నిర్మూలించడంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు విరాళాలను అందిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. మంగళవారం దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షల విరాళం అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సినీ కార్మికుల కోసం ముంబయి ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్కర్స్‌ యూనియన్‌కు  దర్శకుడు రోహిత్‌శెట్టి 51 లక్షలను విరాళంగా ఇచ్చారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ తాను నిర్వహిస్తున్న నామ్‌ ఫౌండేషన్‌ ద్వారా పీఏం కేర్స్‌కు యాభై లక్షలు, మహారాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షలు వితరణ ఇచ్చారు.  కరోనా వ్యాప్తిని  నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయమిదని నానా పటేకర్‌ తెలిపారు.  విక్కీ కౌశల్‌   పీఏం కేర్స్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల్ని విరాళంగా  అందజేశారు. ఐకమత్యంతో కరోనా మహమ్మారిని అంతం చేయాలని విక్కీ కౌశల్‌ పిలుపునిచ్చారు. వారితో పాటు కత్రినాకైఫ్‌, అలియాభట్‌, సారా అలీఖాన్‌,కృతిసనన్‌ పీఏంకేర్స్‌కు సహాయాన్ని అందజేసినట్లు తెలిపింది. అయితే వారు ఎంత మొత్తం ఇచ్చారన్నది వెల్లడించలేదు. logo