గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 11:57:59

ల‌తా మంగేష్కర్ 91వ బ‌ర్త్‌డే.. వేడుకల‌కు దూరం

ల‌తా మంగేష్కర్ 91వ బ‌ర్త్‌డే.. వేడుకల‌కు దూరం

గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ నేడు( సెప్టెంబ‌ర్ 28) 91వ వసంతంలోకి అడుగ‌పెట్టారు. గాన కోకిలగా సుమ‌ధుర‌మైన గొంతుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న ల‌తా మంగేష్క‌ర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. అయితే ల‌తా మంగేష్క‌ర్ త‌న బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను ఘ‌నంగా జరుపుకోవాల‌ని భావించిన‌ప్ప‌టికీ,  కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని క్యాన్సిల్ చేసుకున్నారు మెలోడీ రాణి.

కోవిడ్ 19తో ఎంతో ప్రాణ న‌ష్టం జ‌రిగింది. ఇది ల‌తాని  తీవ్ర మ‌నోవేద‌నకు గురి చేసింది. ఇప్పుడు వేడుక‌లు జ‌రుపుకునే స‌మ‌యం కాదు. మ‌హ‌మ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని  ఆమె కోరార‌ని ల‌తా మేన‌కోడ‌లు, ర‌చ‌యిత ర‌చ‌నా షా పేర్కొన్నారు. 13 ఏళ్ళ వ‌య‌స్సులోనే పాట పాడిన ల‌తా, చివ‌రిగా 2015లో ఆలపించారు. 1972-2015 మ‌ధ్య 25వేల‌కు పైగా పాటలు పాడారు ల‌తా మంగేష్క‌ర్. 

యుగళ గీతమైనా...జానపదమైనా...గజల్ గానమైనా..ఖవ్వాలి రాగమైనా ....భక్తి గీతమైనా ల‌తా మంగేష్క‌ర్  గొంతులో అలవోకగా సాగాల్సిందే... ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టంకట్టే అపురూప గాన గీతిక లతా మంగేష్కర్ త‌న స్వ‌ర మాధుర్యంతో ఏడు ద‌శాబ్ధాల పాటు అల‌రించారు. 


logo