సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 08:47:17

అవినాష్‌, అరియానా మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్.. లాస్య సెటైర్

అవినాష్‌, అరియానా మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్.. లాస్య సెటైర్

బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఈ వారం ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం మంగ‌ళ‌వారం ‘కొంటె రాక్షసులు- మంచి మనుషులు’  అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో ఇంటి స‌భ్యులు రాక్ష‌సులు, మ‌నుషులుగా విడిపోయి గేమ్ ఆడారు.  బుధ‌వారం కూడా ఈ టాస్క్ కొన‌సాగ‌గా, రాక్ష‌సుల టీంలో ఉన్న అఖిల్, హారికల‌ని మంచి మ‌నుషులుగా మార్చి వారి టీంలో కలుపుకున్నారు. చివ‌రికి రాక్ష‌సులుగా అరియానా, మెహబూబ్, అవినాష్‌లు మాత్రమే మిగల‌గా, మిగ‌తా వారంద‌రు మంచి వాళ్ళ టీంలో ఉన్నారు. 

  బుధ‌వారం రోజు ఎపిసోడ్‌లో రాక్ష‌సుల‌ని మంచి మ‌నుషులుగా మార్చేందుకు బిగ్ బాస్ మ‌రో టాస్క్ ఇచ్చారు. స‌ర్కిల్‌లో మంచి మ‌నుషులు ఉండాల‌ని చెప్పిన బిగ్ బాస్ వారి ద‌గ్గ‌ర ఉన్న మూట‌ల‌ను బ‌య‌ట‌కు విసిరేస్తూ ఉండాల‌ని చెప్పారు. ఆ క్ర‌మంలో మంచి మ‌నుషుల టీం స‌భ్యులు స‌ర్కిల్ బ‌య‌ట‌కు రాకూడ‌దు.  కాని మంచి మ‌నుషుల టీం స‌భ్యులు ఈ టాస్క్‌ని స‌రిగా చేయ‌లేక‌పోవ‌డంతో రాక్ష‌సుల టీం విజ‌యం సాధించింది. అనంతరం హారిక‌.. త‌న‌ని వ‌దిలేసి అరియానా, అవినాష్‌, మెహ‌బూబ్ ముగ్గురు వాష్ రూంలోకి వెళ్ల‌డంతో కొంత ఫీలైంది. త‌న బాధ‌ను లాస్య‌తో చెప్పుకుంది

రాక్ష‌సుల టీంలో ఉన్నది ముగ్గురే అయిన మంచి టీం స‌భ్యుల‌కు మూడు చెరువుల నీళ్ళు తాగించారు. ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌న్నింటిని విసిరేస్తూ, వారితో సేవ‌లు చేయించుకుంటూ నానా హంగామా చేశారు.అవినాష్ ..లాస్య‌తో విసిరించుకోవ‌డం, ఆమె ముందు ఇంటిని ర‌చ్చ చేయ‌డంతో లోప‌ల నుండి వ‌స్తున్న కోపాన్ని దిగ‌మింగుకొని న‌వ్వుతూ క‌నిపించింది. అయితే అరియానా, అవినాష్‌ల‌ను మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటూ చుర‌క అంటించింది. 

లాస్య కామెంట్స్ కు అరియానా, అవినాష్‌లు మ‌రింత రెచ్చిపోవ‌డంతో లాస్య చేసేదేం లేక త‌ను అన్న‌మాట‌ను వెనక్కు తీసుకొని  'మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్' అని పొగిడింది.  అనంతరం ఆవేశంతో ఉన్న అవినాష్‌ను మోనాల్ కూల్ చేసేసింది. రాక్ష‌సుల‌కు హ‌గ్స్ ఇస్తూ వారిని శాంతింప‌జేసింది. ముఖ్యంగా అవినాష్‌తో రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. మ‌నిషిగా మారిపోవ‌చ్చుగా అని చెప్పుకొచ్చింది. అందుకు అవినాష్‌.. నువ్వు రాక్ష‌సిగా మారొచ్చుగా అని పంచ్ ఇచ్చాడు. ఇక సోహైల్ స‌ర్ధ‌కున్న బ‌ట్ట‌ల‌న్నింటిని మ‌ళ్ళీ చెల్లాచెదురుగా ప‌డేయించాడు మెహ‌బూబ్.