మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 21, 2020 , 07:34:38

కుమారుడిని చూసి బోరున విల‌పించిన లాస్య‌

కుమారుడిని చూసి బోరున విల‌పించిన లాస్య‌

బిగ్ బాస్ సీజ‌న్ 4లో భాగంగా పెద్దాయ‌న ఇచ్చిన క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్ శుక్ర‌వారం స‌క్సెస్‌ఫుల్‌గా ముగిసింది.  ఇక కెప్టెన్ కోసం ఎప్ప‌టి నుండో కుస్తీలు ప‌డుతూ వ‌చ్చిన హారిక ఎట్ట‌కేల‌కు కెప్టెన్ బ్యాండ్ ధరించింది. ఇక ఎపిసోడ్ మొద‌ట్లో లాస్య భ‌ర్త‌, కుమారుడు హౌజ్‌లోకి వ‌చ్చారు. వారిని చూసిన లాస్య‌కు ఆనంద భాష్పాలు ప్ర‌వాహంలా వచ్చేశాయి. జున్నుని చూసి మురిసిపోతూ త‌న గేమ్ ఎలా ఆడుతుందో క‌నుక్కుంది లాస్య‌.  ఇందుకు స‌మాధానం ఇచ్చిన లాస్య భ‌ర్త మంజునాథ్ ముందు కిచెన్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి గేమ్ ఆడు. 10 వారాల పాటు ఉన్నావంటే మాముల విష‌యం కాదు. నువ్వు చాలా స్ట్రాంగ్ అన్న విష‌యం తెలుసుకో అంటూ ప‌లు సూచ‌న‌లు చేశారు

ఇక జున్నుతో కొంచెం సేపు స‌ర‌దాగా ఆడుకున్న హౌజ్‌మేట్స్ లాస్య వండే ప‌ప్పు గురించి , ఆంటీ అనే విష‌యం గురించి మంజునాథ్‌తో ముచ్చ‌టించారు.  మొత్తానికి ఈ వారం ఇంటి స‌భ్యుల ఫ్యామిలీస్ రావ‌డంతో హౌజ్ ఆహ్లాద‌కరంగా క‌నిపించింది. ఇక కొద్దిసేప‌టి త‌ర్వాత అందం గురించి అరియానా, హారిక‌లో పంచ్ లు వేశాడు అవినాష్‌. మ‌నం అందం గురించి మాట్లాడుకోవ‌ద్దంటూ అరియానాపై సెటైర్స్ వేశాడు


logo