మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 06, 2020 , 09:13:40

క‌డుపులో బిడ్డ‌ని చంపేసుకున్నా.. షాకింగ్ విష‌యాలు చెప్పిన లాస్య‌

క‌డుపులో బిడ్డ‌ని చంపేసుకున్నా.. షాకింగ్ విష‌యాలు చెప్పిన లాస్య‌

బుల్లితెర‌పై త‌న చ‌లాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధ‌లు ఉన్నాయి. బిగ్ బాస్ వేదిక‌గా వాటిని బ‌య‌ట‌పెట్టింది. 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్..  సమాజం కోసం కానీ.. వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల్ని కానీ.. ఇంటి స‌భ్యుల‌తో షేర్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో లాస్య త‌న  క‌డుపులో బిడ్డ‌ని చంపుకున్న విష‌యాన్ని చెబుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

అంద‌రికి ఈ విష‌యం తెలియ‌దు. నాకు 2010లోనే పెళ్లైంది. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రం వేరు వేరుగా ఉన్నాం. 2012 నుండి క‌లిసి ఉంటున్నాం. ఇరు కుటుంబాలని ఒప్పించేందుకు చాలా ప్ర‌య‌త్నం చేసాం. 2014 జ‌న‌వ‌రిలో మా నాన్న ద‌గ్గ‌ర నుండి ఫోన్ వ‌చ్చింది. సంతోషించాను. అప్పుడు ఆయ‌న మాట్లాడుతూ..నువ్వు పెళ్ళి చేసుకున్న విష‌యం మ‌న ఫ్యామిలీలో ఎవరికి తెలియ‌దు. నేను ఎవ‌రికి చెప్ప‌లేదు, నువ్వు ఎవ‌రికి చెప్ప‌కు. మీరు సెటిల్ అయ్యాక నేనే మీ పెళ్లి చేస్తా అని అన్నాడు లాస్య తండ్రి.

ఓ రోజు అనారోగ్యంతో ఆసుప‌త్రికి వెళితే ప్రెగ్నెంట్ అని చెప్పారు. పేరెంట్స్ కి ఈ విష‌యం చెప్ప‌లేం. ఏం చేయాలో అర్దంకాక క‌డుపు తీయించుకున్నా. 2014లో ఇది జ‌ర‌గగా, 2017లో మా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లి అయింది. పెళ్ళైన 5 నెల‌ల‌కు మ‌ళ్ళీ ప్ర‌గ్నెంట్ అయ్యాను. కాని మూడు నెల‌ల త‌ర్వాత మిస్ క్యారీ అయింది. చాలా బాధ ప‌డ్డాను. ఇక మ‌ళ్లీ నాకు ప్ర‌గ్నెన్సీ రాదేమో అని అనిపించింది. 

2014లో హాస్పటల్‌కి వెళ్లి చెక్ చేయించుకున్న తరువాత ప్రెగ్నెంట్ అని చెప్పారో.. ఆ ఫైల్ చూసుకున్నప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. ఇప్పటికీ ఆఫైల్ నా దగ్గర ఉంది. ఫ‌స్ట్ బేబీని చాలా మిస్ అవుతున్నా. నా చేతుల‌తో చంపేసుకున్నా. ఇక 2018లో మ‌ళ్ళ్ళీ నా క‌డుపులో జున్నుగాడు వ‌చ్చాడు. రెండు సార్లు పోగొట్టుకున్న నేను జున్న‌గాడి విషయంలో ఆ ప‌ని చేయ‌ద‌ల‌చుకోలేదు.వాడు వ‌చ్చాక నా జీవితం పూర్తిగా మారింది. అమ్మా నాన్నా.. అప్పుడు ఫస్ట్ బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలియదు ఇప్పుడు చెప్తున్నా కాబట్టి.. తప్పు చేసి ఉంటే క్షమించండి’  అంటూ భావోద్వేగంతో  కన్నీరు పెట్టుకుంది లాస్య‌


logo