మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 09:10:37

అభి అంటే ఇష్టం అంటూ అత‌నిపైనే బిగ్ బాంబ్ వేసిన లాస్య‌

అభి అంటే ఇష్టం అంటూ అత‌నిపైనే బిగ్ బాంబ్ వేసిన లాస్య‌

ఇంటి సభ్యుల‌తో లూడో గేమ్ ఆడించిన త‌ర్వాత అరియానా, లాస్య‌ల‌లో ఒక‌రిని ఎలిమినేట్ చేసే టైం వ‌చ్చింద‌ని నాగార్జున చెప్పారు. ఈ క్ర‌మంలో అరియానాని సేవ్ చేసి లాస్య‌ని ఎలిమినేట్ చేశారు. న‌వ్వుకుంటూనే స్టేజ్‌పైకి వ‌చ్చిన లాస్య త‌న జ‌ర్నీ చూసి ఎమోష‌న‌ల్ అయింది. ఆ త‌ర్వాత టాప్ 2లో సోహైల్‌, అభిజిత్ ఉంటార‌ని పేర్కొంది. ఇక ఇంటి స‌భ్యుల గురించి ఒక్కో విష‌యం చెబుతూ వ‌చ్చింది.

అవినాష్ .. చాలా ఎంట‌ర్‌టైన్ చేస్తాడు కాని నామినేష‌న్ అంటే తీసుకోలేడు. మోనాల్ ఎప్పుడు క‌న్ఫ్యూజన్‌లో ఉంటుందనిపిస్తుంది. తెలుగు రాక‌నో ఏంటో నాకు అర్దం కాదు. ఇప్పుడు బాగా ఆడుతుంది. అరియానా బోల్డ్‌గా ఉంటుంది. కొన్ని సార్లు త‌ప్పులు కూడా ఒప్పుకోవ‌ల‌సి ఉంటుంది .ఇక అఖిల్ బాగా ఆడ‌తాడు కాని త‌న కోప‌మే త‌న శ‌త్రువు. ఎదుటి వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వ‌డు. అది మార్చుకుంటే చాలు. ఇక సోహైల్‌కు ఎంత కోపం వ‌స్తుందో అంత త్వ‌ర‌గా వెళుతుంది.  హారిక అల్ల‌రి పిల్ల త‌న‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డం హ్య‌పీగా ఉంటుంది.

ఇక హౌజ్‌లో అబిజీత్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పిన లాస్య బిగ్  బాంబ్‌ని అత‌నిపైనే వేసింది. వారం రోజుల పాటు వంట చేయాల‌ని చెప్ప‌గా, అది నావ‌ల్ల కాదంటూ బ్రేక్ ఫాస్ట్ చేస్తాన‌ని ఒప్పుకున్నాడు. మొత్తానికి ఎవరిని నొప్పించ‌కుండా అంద‌రి గురించి మాట్లాడి బిగ్ బాస్ హౌజ్‌ను వీడింది లాస్య


logo