గురువారం 28 మే 2020
Cinema - Apr 30, 2020 , 11:10:17

రిషీకపూర్‌ చివరి ట్వీట్‌ ఇదే..

రిషీకపూర్‌ చివరి ట్వీట్‌ ఇదే..

బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ ట్విట్టర్‌లో చురుకుగా ఉండేవారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. అయితే ఆయన చివరగా ఏప్రిల్‌ 2న ఓ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19పై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులపై దాడులకు నిరసనగా రిషీ కపూర్‌ ట్వీట్‌ చేశారు. సోదరాసోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నాను.. హింసను ప్రేరేపించవద్దు. రాళ్లు విసరడం, చంపడం వంటి చర్యలకు పాల్పడొద్దు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బం, పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. మనకు రక్షణ కల్పిస్తున్నారు. మనందరం కలిసి కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కోవాలి అని రిషీ కపూర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సేపటి క్రితం  కన్నుమూశారు. 2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు.ఆయ‌న మృతికి సంబంధించిన విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ లో తెలిపారు.  ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు. 


logo