శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 12:44:19

సింగిల్ ఉమెన్‌గా ఇంకా రెండు రోజులే: కాజ‌ల్‌

సింగిల్ ఉమెన్‌గా ఇంకా రెండు రోజులే: కాజ‌ల్‌

టాలీవుడ్ క‌లువ‌క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్ప‌నున్న విష‌యం తెలిసిందే. గౌత‌మ్ కిచ్లూతో కాజ‌ల్‌ అక్టోబ‌ర్ 30న ఏడ‌డుగులు వేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంజాయ్ చేసిన సింగిల్ లైఫ్ కు ఇంకా రెండు రోజులే మిగిలి ఉందంటోంది కాజ‌ల్‌. ఈ విలువైన స‌మ‌యాన్ని చెల్లెలు నిషాతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపేలా ప్లాన్ చేసుకుంది. ముంబైలోని నివాసంలో నిషాతో సోఫాలో క‌లిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మిస్ అగ‌ర్వాల్ కు ఇంకా రెండు రోజులే. ప్ర‌తీ విష‌యాన్ని నా పార్ట్‌న‌ర్ (నిషా) తో షేర్ చేసుకుంటూ.. అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది కాజ‌ల్‌.

కాజ‌ల్ హ‌ల్దీ, మెహెందీ సెర్మ‌నీ వేడుక‌లు బుధ‌వారం జ‌రుగ‌నున్నాయి. అక్టోబ‌ర్ 29న సంగీత్ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. కోవిడ్ ప‌రిస్థితుల నేప‌త్యంలో కాజ‌‌ల్ త‌న వెడ్డింగ్ కు టాలీవుడ్ సెల‌బ్రిటీలెవ‌రికీ ఆహ్వానం పంప‌నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి కాజ‌ల్ పెళ్లికి హాజ‌ర‌య్యే న‌టుడిని తానొక్క‌డినేన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.