మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 16:57:06

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకు టైటిల్ ఫిక్స్..!

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకు టైటిల్ ఫిక్స్..!

టాలీవుడ్ యువ న‌టుడు నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది అశ్వ‌త్థామ చిత్రంతో ఆడియెన్స్ ను ప‌లుక‌రించిన ఈ యంగ్ యాక్ట‌ర్ స్పోర్ట్స్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు ల‌క్ష్య టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. పార్థు, అర్జున వంటి టైటిల్స్ ప‌రిశీలించిన టీం ఫైన‌ల్ గా ల‌క్ష్య‌ను ఫిక్స్ చేసిన‌ట్టు టాక్‌. ఆర్చ‌రీలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వ్య‌క్తిగా నాగశౌర్య క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది.

శ‌ర‌త్‌మరార్‌, నారాయ‌ణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 మొద‌టి త్రైమాసికంలో ఈ మూవీని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్‌. నాగశౌర్య ఇప్ప‌టికే అనీష్ కృష్ణ డైరెక్ష‌న్ లో వరుడు కావ‌లెను మూవీతోపాటు శ్రీనివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo