బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 10:49:35

ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాదం.. ల‌క్ష్య టీజ‌ర్

 ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాదం.. ల‌క్ష్య టీజ‌ర్

టాలీవుడ్ యువ న‌టుడు నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. గ‌త‌ ఏడాది అశ్వ‌త్థామ చిత్రంతో ఆడియెన్స్ ను ప‌లుక‌రించిన నాగ‌శౌర్య ప్ర‌స్తుతం వ‌రుడు కావ‌లెను, ల‌క్ష్య‌, పోలీస్ వారి హెచ్చ‌రిక అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రోజు నాగ శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూడు చిత్రాల నుండి ఆస‌క్తిక‌ర వీడియోలు విడుద‌ల‌య్యాయి.  తాజాగా ల‌క్ష్య టీజ‌ర్‌ని విడుద‌ల చేసి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని పెంచారు.

ల‌క్ష్య చిత్రం స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రాన్ని సంతోష్ జాగ‌ర్ల‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. ఆర్చ‌రీలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వ్య‌క్తిగా నాగశౌర్య క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. శ‌‌ర‌త్‌మరార్‌, నారాయ‌ణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 మొద‌టి త్రైమాసికంలో ఈ మూవీని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైన ల‌క్ష్య టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాదం అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. మీరు టీజ‌ర్‌ని చూసి ఎంజాయ్ చేయండి.VIDEOS

logo