అహ్మదాబాద్ : గర్ల్‌ఫ్రెండ్‌తో పోలుస్తూ భార్యను అందంగా నాజూకుగా లేవని వేధిస్తున్న భర్త ఉదంతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. నల్లగా, లావుగా ఉన్నానంటూ భర్త తనను నిత్యం వేధిస్తున్నాడని, కుటుంబ సభ్యుల సహకారంతో తీవ్రంగా కొడుతున్నాడని మహిళ పోలీసులను ఆశ్రయించింది. 2008లో పెండ్లయినప్పటి నుంచి తన భర్త, అత్తమామలు తనను కట్నం కోసం వేధించేవారని, తన తల్లితండ్రులు అత్తింటి వారిని తృప్తిపరచకపోవడంతో తన భర్త సహా మెట్టినింట అందరూ చిన్న విషయాలకే తనను కొట్టేవారని బాధిత మహిళ పేర్కాంది.
తాను అందంగా లేనని భర్త తరచూ నిందించడంతో పాటు వంట సరిగ్గా చేయనని వేధించేవాడని చెప్పుకొచ్చారు. భర్త కుటుంబ సభ్యులు సైతం తనపై అతడిని ఉసిగొల్పేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఆడబిడ్డను కంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని భర్త ఆయన కుటుంబ సభ్యులు తనను బెదిరించేవారని వెల్లడించింది. బాధిత మహిళ ఫిర్యాదుపై భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.