అమీర్‌ఖాన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లగాన్..వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ఇండియా. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లగాన్ టీం నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. లగాన్ టీం కలయికలో ఛలే ఛలో లగాన్..వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ యాన్ ఇంపాజిబుల్ డ్రీమ్ త్వరలో నెట్ ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ కానుంది.
‘లగాన్’ మనందరిపై ఎంతో ప్రేమను కురిపించింది. ఈ మాయా ప్రయాణంలో నాతో కలిసి ప్రయాణం చేసిన వారికి చాలా కృతజ్ఞతలు. అషు, అతని రచయితల బృందం, మొత్తం టీం, సిబ్బంది, మా భాగస్వాములు, మా పంపిణీదారులు, నా సినీ పరిశ్రమకు చెందిన సీనియర్లు మాకు తమ హృదయపూర్వక మద్దతును తెలిపారు. వారికి ముఖ్యంగా మా ప్రేక్షకులైన మీ అందరికీ సరిపడా కృతజ్ఞతలు చెప్పలేను అంటూ అమీర్‌ఖాన్ బావోద్వేగపూరిత సందేశాన్ని అందరితో పంచుకున్నారు. అశుతోష్ గోవారికర్ డైరెక్షన్ లో తెరకెక్కిని ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్ నిర్మించారు.
ఇవి కూడా చదవండి..
కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా..?
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్