బుధవారం 27 జనవరి 2021
Cinema - Mar 06, 2020 , 12:18:06

అంతా స‌స్పెన్స్‌.. 'నిశ్శ‌బ్ధం' ట్రైల‌ర్ విడుద‌ల‌

అంతా స‌స్పెన్స్‌.. 'నిశ్శ‌బ్ధం' ట్రైల‌ర్ విడుద‌ల‌

గ్లామర్ చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది అనుష్క‌.  లేడీ సూపర్ స్టార్ గా, జేజమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో చెర‌గ‌ని  స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క చివ‌రిగా భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించింది .ఈ సినిమా తర్వాత అనుష్క చాలా రోజులు గ్యాప్ తీసుకొని   ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేసింది . ఈ సినిమాలో స్వీటీ ఇంతవరకూ చేయనటువంటీ మూగ, చెవిటి పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్,  టీజర్ లకు మంచి స్పందన వచ్చింది.  తాజాగా చిత్ర ట్రైల‌ర్ నాని చేతుల మీదుగా విడుద‌లైంది.  ఇందులో అనుష్కకు ఏదో యాక్సిడెంట్ అవ్వడం.. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి సైగలతో ఏదో చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

హేమంత్ మధుకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నిశ్శ‌బ్ధం సినిమా అంతా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది.   మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు  కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ట్రైల‌ర్‌ని బ‌ట్టి చెప్పొచ్చు.  ట్రైల‌ర్  సినిమాపై భారీ అంచనాలే పెంచేసింది. కాగా, వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’ పేరుతో విడుదల చేస్తుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో ఏప్రిల్ 2న‌ రిలీజ్ చేయనున్నారు.   
logo