‘కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి సిద్ధమవుతాడో పల్లెటూరి యువకుడు. ఈ ప్రయాణంలో అతడికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయో తెలియాలంటే తెరపై చూడాల్సిందే’ అంటున్నారు విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాభం’. ఎస్.పి. జననాథన్ దర్శకుడు. బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మాత. శృతిహాసన్ కథానాయిక. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘వ్యవసాయం ఔన్యతాన్ని చాటిచెప్పే చిత్రమిది. సందేశం, ప్రేమ, యాక్షన్ అంశాల కలబోతగా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది’ అని తెలిపారు. జగపతిబాబు, ధన్సిక, రమేష్ తిలక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి ఇమాన్.