ఆదివారం 23 ఫిబ్రవరి 2020
వై దిస్ కొల‌వ‌రి స్టైల్‌లో విజ‌య్ పాడిన పాట

వై దిస్ కొల‌వ‌రి స్టైల్‌లో విజ‌య్ పాడిన పాట

Feb 15, 2020 , 08:49:44
PRINT
వై దిస్ కొల‌వ‌రి స్టైల్‌లో  విజ‌య్ పాడిన పాట

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మాళ‌విక‌, ఆండ్రియా మోహ‌న‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా చిత్రం నుండి విజ‌య్ పాడిన పాట విడుద‌ల చేశారు. కుట్టీ స్టోరీ అంటూ సాగే ఈ పాట‌ని వింటుంటే అప్ప‌ట్లో ధ‌నుష్ పాడిన వై దిస్ కొల‌వ‌రి పాట గుర్తొస్తుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ పాట‌కి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, అనురాజా కామ‌రాజ్ లిరిక్స్ అందించారు.  ఈ మూవీలో విజ‌య్ సేతుప‌తి విల‌న్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుద‌ల చేస్తే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల విజ‌య్‌పై ఐటీ రైడ్స్ జ‌రిగిన నేప‌థ్యంలో చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. 
logo