పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కూడా అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈయన ఖుషీ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి విశేషాలను ఇప్పుడు పంచుకున్నారు. 2001, ఎప్రిల్ 27న ఈ చిత్రం విడుదలైంది. అప్పటికే తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖుషీ సినిమాను అదే పేరుతో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా రీమేక్ చేసాడు దర్శకుడు సూర్య. వరస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కెరీర్ లో 7వ చిత్రంగా వచ్చింది ఖుషి. సెవెన్త్ వండర్ అంటే ఏంటో చూపించింది. ఆ సమయానికి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం. తాజాగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ‘#20YearsForClassicIHKushi’ అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటి ఖుషీ సినిమా కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎంత వచ్చాయో చూద్ాం..
నైజాం- 7.40 కోట్లు
సీడెడ్- 3.35 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.60 కోట్లు
ఈస్ట్- 1.50 కోట్లు
వెస్ట్- 1.18 కోట్లు
గుంటూరు- 1.50 కోట్లు
కృష్ణా- 1.70 కోట్లు
నెల్లూరు- 0.97 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 19.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 1.00 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 20.20 కోట్లు
అప్పట్లోనే ‘ఖుషి’ సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 20.20 కోట్ల షేర్ రాబట్టింది. ఆ రోజుల్లో ఓ సినిమా నుంచి 7 కోట్ల లాభాలు అంటే చిన్న విషయం కాదు. అప్పటికి పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఖుషీ. ఇన్నేళ్లైనా కూడా ఈ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయాయి.
ఇవికూడా చదవండి
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో