శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 12:45:46

మీరు ఏం చేయాల‌నుకుంటున్నారో అదే చేయండి..

మీరు ఏం చేయాల‌నుకుంటున్నారో అదే చేయండి..

కిడ్నీ సంబంధింత వ్యాధుల వ‌ల‌న ర‌జనీకాంత్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చే ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్టు ఇటీవ‌ల ఒక ఫేక్ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన ర‌జ‌నీకాంత్‌.. ఆ లెట‌ర్ నాది కాదు, కాక‌పోతే నా ఆరోగ్యంకు సంబంధించి అందులో ఉన్న సారాంశం వాస్తవం అని అన్నారు. అయితే ర‌జ‌నీకాంత్‌కు కిడ్నీ మార్పిడి జ‌రిగిందనే విష‌యం అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులకు షాకిచ్చింది. రిస్క్ చేసి ఆయ‌న రాజ‌కీయాల‌లోకి రావొద్ద‌నే వాద‌న పెరిగింది.

రీసెంట్‌గా సీనియర్ నటి, బీజేపీ నాయ‌కురాలు ఖుష్బూ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ .. ప్రియ‌మైన ర‌జ‌నీకాంత్ గారికి, మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. అంతకు మించింది ఏది లేదు. వ‌జ్రం లాంటిది మీ మ‌న‌సు. నిండు నూరేళ్ళు మీరు జీవించాలి . అందుకు మీరు ఏం చేయాలంటే అది చేయండి. మీ పై మాకున్న ప్రేమ ఏ కార‌ణంగాను త‌గ్గ‌దు. మిమ్మ‌ల్ని నిత్యం ఆరాధిస్తూనే ఉంటాం అని ఖుష్బూ పేర్కొన్నారు. కాగా,  ఖుష్బూ ప్రస్తుతం రజినీకాంత్ సరసన అన్నాత్తే అనే సినిమాలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనా, కీర్తి సురేష్ కూడా నటిస్తున్నారు

తాజావార్తలు