శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 10:02:15

కెప్టెన్ బ్యాండ్ అందుకున్న కుమార్ సాయి

కెప్టెన్ బ్యాండ్ అందుకున్న కుమార్ సాయి

బిగ్ బాస్ సీజ‌న్ 4లో 27వ ఎపిసోడ్‌కి సంబంధించి కెప్టెన్ పోటీ దారుని కోసం టాస్క్ ఇచ్చారు . కెప్టెన్ పోటీ దారులుగా అమ్మ రాజ‌శేఖ‌ర్, కుమార్ సాయి, హారిక‌, సుజాత బ‌రిలో నిల‌వ‌గా కాసుల వేట అనే టాస్క్‌లో వీరు పోటీ ప‌డ్డారు. బుర‌ద‌లో కాయిన్స్ ని ఉంచగా, వాటిని ఈ న‌లుగురు పోటీ దారులు తీసి వారికి సంబంధించిన బుట్ట‌లో వేయాల‌ని అన్నారు. చివ‌రికి ఎవ‌రి బుట్ట‌లో ఎక్కువ కాయిన్స్ ఉంటే వారే కెప్టెన్‌గా ఉంటారు అని బిగ్ బాస్ చెప్పారు. 

బ‌జ‌ర్ మోగ‌గానే  కాయిన్స్  కోసం బుర‌ద‌లో ప‌డి దొర్లారు. చివ‌ర‌కు హారిక 2000 కాయిన్స్.. అమ్మా రాజ‌శేఖ‌ర్ 2300, సుజాత 2900, కుమార్‌కి 3500 కాయిన్స్ రావడంతో ఈవారం కెప్టెన్‌గా కుమార్ సాయి నిలిచాడు. దీంతో అత‌నిని విమ‌ర్శించిన వాళ్ళు కూడా త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే పోటీలో గెలిచినందుకు కెప్టెన్ బ్యాండ్ ధరించాలని బిగ్ బాస్ కుమార్ సాయిని కోరారు. అంతేకాక అత‌నికి బంపర్ ఆఫ‌ర్ ఇచ్చారు కూడా. 

కెప్టెన్ బ్యాండ్ ధరించిన కారణంగా వచ్చే నామినేషన్స్ నుంచి కుమార్ సాయికి మినహాయింపు ఉంటుంద‌ని బిగ్ బాస్ తెలిపారు.  ఈ వారం కుమార్ సాయి నామినేష‌న్‌లో ఉండ‌గా, ఈ గండం దాటితే వ‌చ్చే వారం కూడా మ‌నోడికి ఎలాంటి ఢోకా ఉండ‌దు. అయితే అర్ధ‌రాత్రి స‌మ‌యంలో అభిజిత్‌.. హారిక‌, దివిల‌తో కూర్చొని త‌న ప్రేమాయ‌ణంపై నోరు విప్పాడు. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డుస్తుంద‌నే నెగెటివ్ కామెంట్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో స్పందించిన అభిజిత్‌.. ఇలాంటి యాంగిల్స్ నా కొద్దు.  ఇంటికి వెళ్లిన తరువాత చండాలంగా ఉంటుంది. అమ్మా వాళ్లు ఏం అవుతుందా? అని నన్ను చూస్తూ ఉంటారు.. ఐ లైక్ యు అని అనుకున్నాం కానీ ఇంత మ్యాటర్ అవుతుందని అనుకోలేదు’ అంటూ మ‌న‌సులోని మాట చెప్పుకొచ్చాడు అభిజిత్.

స్వాతి దీక్షిత్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అభిజిత్‌.. ఆమెతో ఎక్కువ చ‌నువుగా ఉంటున్నాడు. అదే స‌మ‌యంలో మోనాల్‌..అఖిల్‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. ఇద్ద‌రు క‌లిసి గేమ్ ఆడ‌డం, ముచ్చ‌ట్లు పెట్ట‌డం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. గురువారం ఎపిసోడ్‌లో అఖిల్ సోఫాలో దుప్ప‌టి క‌ప్పుకొని ప‌డుకోగా, కింద కూర్చొని ఉన్న మోనాల్ సోఫాలో త‌ల‌పెట్టి ప‌డుకుంది. అఖిల్ ..మోనాల్ త‌ల నిమ‌ర‌డం, మోనాల్‌.. అఖిల్ త‌ల నిమ‌రుకుంటూ క‌నిపించే స‌రికి ప్రేక్ష‌కులు వీరిద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.